
ఈ లోగా ఆయన మూడవ చిత్రం…. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో ప్రకటించారు. దీనితో పవన్ కళ్యాణ్ మొత్తంగా మూడు సినిమాలకు ఒకే చెప్పినట్టు అయ్యింది. తాజాగా ఇంకో దర్శకుడితో కూడా ఆయన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన దర్శకుడు బాబీ ఆయన కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.
ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా దానికి పని చేస్తున్నారట. సబ్జెక్టు ప్రాధమికంగా పవన్ కళ్యాణ్ కు నచ్చిందని, తొందరలో పూర్తి స్క్రిప్ట్ విని తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. బాబీ ఇటీవలే వెంకటేష్, నాగచైతన్యలతో వెంకీ మామ అనే సినిమా చేసి హిట్ కొట్టారు.
దీని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది. బహుశా వచ్చే ఎన్నికలకు ఒక్క ఏడాది ముందు వరకూ సినిమాలు చేసి ఆ ఒక్క సంవత్సరం పూర్తిగా రాజకీయాల మీద దృష్టిపెడతారు. అయితే దీనిని ప్రజలు హర్షిస్తారా అనేది చూడాలి.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…