Telugu

‘సర్ధార్’ స్టిల్స్ కేక పుట్టించారుగా..!

పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ లో సందడి చేస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” షూటింగ్ పిక్స్ ను ‘చందమామ’ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ సినిమా ఆల్బమ్ లో ఉన్నటువంటి ఏకైక మెలోడీ పాట చిత్రీకరణగా తెలుస్తోంది.

బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో కనపడుతున్న పవన్ గాగుల్స్ తో మరింత స్టైలిష్ గా తయారయ్యారు. ఇక, ‘చందమామ’ కాజల్ ఎప్పటిలాగానే ఎర్రటి కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతోంది. షూటింగ్ స్పాట్ వెనుక అందమైన లొకేషన్, దానికి తగిన విధంగా హీరోహీరోయిన్ల కాస్ట్యూమ్స్ తో కూడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT

ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు నిరీక్షిస్తున్నారు. 31వ తేదీన సెన్సార్ ముందుకు వెళ్తుందన్న వార్తలు వెలువడ్డప్పటికీ, ఇప్పటికీ షూటింగ్ సాగుతుండడంతో ‘సర్ధార్’ రిలీజ్ డేట్ పై ఉత్కంఠ నెలకొంది. అయితే స్విట్జర్లాండ్ లో షూటింగ్ తో పాటు హైదరాబాద్ లో ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Toughest Test for a Star Kid in the Social Media Era?

Nandamuri Balakrishna has finally confirmed the debut film of his son, Nandamuri Mokshagna. The project…

3 minutes ago

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

12 minutes ago