
రాజకీయంగా ఇబ్బంది అని దానిపై అధికారిక ప్రకటన కూడా చేయించలేదు. సైలెంట్ గా డ్రెస్ మార్చి అమరావతిలో దిగిపోయాడు పవన్. అయితే ఆయన షూటింగ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వచ్చేసి పెద్ద దుమారమే లేపాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద విషయం జరుగుతుంటే సినిమాను వాయిదా వేసుకోలేవా అంటూ మిగతా పార్టీ వారు పవన్ పై విరుచుకుపడ్డారు.
దీనితో షాకైన పవన్ దిల్ రాజు మీద ఫైర్ అయినట్టు సమాచారం. నేను మరీ మరీ చెప్పినా కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? అంటూ పవన్ విరుచుకుపడ్డారట. ఇక ముందు ఇటువంటివి జరిగితే సహించబోనని తేల్చి చెప్పారట. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి నుండి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఈ చిత్రాన్ని మేలో వేసవి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు షూట్ చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. ప్రస్తుతం వారి మీద కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…