
పింక్ లో అమితాబ్ బచ్చన్ ఒక ముసలి లాయర్ గా కనిపిస్తారు. ఆయన ఆరోగ్యం బాలేని సతీమణిని చూసుకుంటూ ఉండే పాత్రలో కనిపిస్తారు. అయితే ఈ మొత్తం ఘట్టం సినిమాలో మార్చేశారట. పవన్ కళ్యాణ్ కోసం మాస్ బ్లాక్ ఒకటి పెట్టి, ఒక ఫైట్ కోసం పెట్టారట. ఇటీవలే ఈ ఫైట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది.
మరోవైపు వకీల్ సాబ్ ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మొదటి పాట ‘మగువా మగువా’ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రెడీ చేసే పనిలో ఉందట.
మార్చి 25న ఉగాది సందర్భంగా ఈ టీజర్ ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారంట. దీని కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటినుండే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. మే 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…