
అయితే ఈ పొగడ్తల ‘ఎపిసోడ్’ మొత్తానికి హైలైట్ గా నిలిచిన అంశం… ‘ఇంద్ర’ సినిమాలో వీణ స్టెప్ ప్రస్తావన. “ఇందాకా అలీ చెప్పినట్లుగా తన ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయి దాయి దామ్మా…’ పాటలోని వీణ స్టెప్ ను పవన్ వేసాడంటే గనుక మీ అందరికీ చూడాలని ఎంత ఉత్సాహంగా ఉందో అంతకు మరిన్ని రెట్లు నాలో ఉత్సాహం నెలకొందని, బహుశా ఈ సినిమా చూస్తున్నపుడు ఈ వీణ స్టెప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటంత ఉత్సాహం నెలకొంటుందేమోనని… ఇలాంటివన్నీ ఫ్యాన్స్ కు ఒక గిఫ్ట్ వంటివని…” మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో… పవన్ పలికించిన హావభావాలు గురించి విశ్లేషించడం కన్నా… చూస్తే ఆ కిక్కే వేరని చెప్పాలి.
అన్నయ్య పొగడ్తలు చేస్తున్న సమయంలో… తమ్ముడు ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని సిగ్గు పడటం… చూసి తరించడానికి అభిమానులకు బహుశా రెండు కళ్ళు చాలవేమో అనే విధంగా పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎడతెరిపి లేకుండా పవన్ పై అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపిస్తున్న సమయంలో… అన్నయ్య దాహార్తిని తీర్చేందుకు తమ్ముడు వాటర్ బాటిల్ క్యాప్ తీసేసి చిరుకు అందజేసిన వైనం అభిమానుల ‘దిల్’ నిండా ‘ఖుషీ’ని నింపింది. ఇలాంటి అనేక ఘటనల సమాహారమే ‘రత్నాపూర్ కా సర్ధార్’ ఆడియో వేడుక.
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…
Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…