
ఈవెంట్ యొక్క ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. గతంలో చాలా సార్లు మాదిరి గానే పవన్ కళ్యాణ్ ఈ సారి కూడా ఈ ఈవెంట్ కను మిస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తి. కావున కుటుంబ కార్యక్రమాలకు కూడా క్రమం తప్పకుండా హాజరుకారు. అయితే ఈ సారి మాత్రం తాను చేస్తున్న దీక్ష కారణంగానే రాలేకపోయారని అంటున్నారు.
ఈ దీక్షలో ఉన్న అన్ని రోజులు ఆయన సాయంత్రం ఆరు తరువాత బయటకు రారు. విశేష పూజలు ఏవో చేస్తారట. దానితో నిన్న పొద్దునే నాగబాబు ఇంటికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించి వచ్చారట. ఇకపోతే ఈ వివాహం డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది.
వివాహం అయిన తర్వాత నిహారిక సినిమాలు చేయడం మానేయవచ్చు అంటున్నారు. అందువల్ల, ఆమె ఇప్పటికే కొత్త చిత్రాలకు సంతకం చేయడం మానేసింది. మెగా కుటుంబం నుండి సినీరంగ ప్రవేశం చేసిన తొలి మహిళ నిహారికా. ఏదేమైనా, ఆమె తన మొదటి మూడు చిత్రాలు – ఒక మనసు, సూర్యకాంతం మరియు హ్యాపీ వెడ్డింగ్ తో డిస్జాస్టర్ల హాట్రిక్ ఇచ్చింది.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…