
పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా కోసం మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్‌తో ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అంటూ దర్శకుడు త్రివిక్రమ్ వీరితో చెప్పడం జరిగింది. మరో వైపు వీరు పవన్‌తో సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆయనకు ఇష్టం వచ్చిన దర్శకుడితో పవన్‌తో సినిమాను నిర్మించాలని కూడా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఒక్క సినిమాతోనే మైత్రి మూవీస్ వారు పెద్ద పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేయడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తోంది. మరి మైత్రి మూవీస్ నిర్మాతల ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనో చూడాలి.
The December release battle is getting interesting with Balakrishna’s NBK111 Dada and Nagarjuna’s King 100…
After days of uncertainty, Nani’s The Paradise is finally staying on course for its original…