
సంక్రాంతి 2021 కోసం ఈ చిత్రం విడుదల చెయ్యనున్నట్టు వార్తలు వస్తున్నాయి కాని ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. షూటింగ్ పూర్తయిన తర్వాతే ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పకీన్ కళ్యాణ్ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తరువాత తిరిగి వచ్చి చేసిన మొదటి చిత్రం వకీల్ సాబ్.
ఇది బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలలో నివేదా థామస్, అంజలి మరియు అనన్య నాగల్లలు కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హస్సన్ హీరోయిన్ గా నటించనుంది. గబ్బర్ సింగ్, కాటమరాయుడు తరువాత ఇది వారిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా.
ఎంసిఏ ఫేమ్ వేణు శ్రీరామ్ మెగాఫోన్‌ను పట్టుకుంటున్నాడు. తమన్ సంగీత స్వరకర్త. పవన్ కళ్యాణ్ సినిమాకు పని చెయ్యడం తమన్ కు ఇదే మొదటిసారి. ఆ మధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన మొదటి పాట ‘మగువా మగువా’ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…