
రాజమౌళి, ఎన్టీఆర్ లతో కొంత మాట కలిపారని మనకున్న సమాచారం. సినిమా కోసం వేసిన సెట్లను ఆసక్తికరంగా తిలకించారట పవన్. చిరంజీవి ఆచార్య చిత్రంలో తన అతిధి పాత్ర కోసం తూర్పు గోదావరి షూటింగ్లో ఉన్నందున రామ్ చరణ్ సెట్లో లేడు. పవన్ కళ్యాణ్ రాజమౌళి ఇప్పటివరకు కలిసి పని చెయ్యలేదు.
అయితే వారిద్దరూ కలిసి పని చెయ్యాలని ఎప్పటి నుండో మెగా అభిమానుల కోరిక. అయితే పవన్ సినిమాలు, రాజకీయాలలో రెండు పడవల ప్రయాణం చేస్తుండడంతో రాజమౌళి కావాలని కోరుకునేలా రెండు మూడేళ్లు పూర్తిగా సమయం సినిమాకే కేటాయించలేరు. దానితో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కుదిరి అవకాశం లేనట్టే.
ఆర్ఆర్ఆర్ను అక్టోబర్ 13 న దసరా స్పెషల్‌గా సిద్ధం చేస్తున్నారు. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ కోసం పవన్ కళ్యాణ్, రానా జతకడుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9 న వినాయక చవితి స్పెషల్ గా విడుదల కానుంది. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ కె చంద్ర ఈ రీమేక్ ప్రాజెక్ట్ కోసం మెగాఫోన్‌ను పట్టుకున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ యొక్క డైలాగ్ వెర్షన్ అందించారు.
Shah Rukh Khan’s King is one of the most awaited films of 2026. Everyone is…
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…