
జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించి జెండా వందనం చేసిన తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అవినీతిలో కూరుకుపోయిన ఈ వైసీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రాన్ని మరోసారి విడగొట్టాలని కోరుకొంటున్నారు. కొందరు రాయలసీమ వేరే రాష్ట్రం చేయాలని కోరుతుంటే, కొందరు ముసలి నేతలు ఉత్తరాంద్ర ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుతున్నారు. వీరి ధోరణితో ప్రజలు చాలా విసుగెత్తిపోయారు. మరోసారి రాష్ట్రం విడగొడతామని ఎవరైనా అంటే తోలు తీస్తా. వేర్పాటువాద ధోరణిని మానుకోకపోతే నా అంతటి తీవ్రవాది మరొకరిని చూడరు. పబ్లిక్ పాలసీ అంటే కూడా తెలియని ముసలి నేతలు రాష్ట్రాన్ని విడగొట్టాలంటారా?ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో ప్రజలని విడగొట్టింది చాలు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం అంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త!” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు తన నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “ఏపీలో పరిశ్రమలు లేవు… పెట్టుబడులు రావు… ఉన్న పరిశ్రమలు వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. ఉద్యోగాలకి నోటిఫికేషన్లు రావు. ఉద్యోగాలు దొరక్క ఏపీలో నిరుద్యోగులు ఇరుగు పొరుగు రాష్ట్రాలకి వలసలు పోవలసివస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కనుక ఏపీలో ఈ పరిస్థితులు చక్కబడాలంటే జగన్ ప్రభుత్వం పోవలసిందే… మళ్ళీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావలసిందే,” అంటూ నిప్పులు చెరిగారు.
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…