పవన్ క్రేజ్ : ఒక్క పోస్టర్ తో ఇండియా వైడ్ ‘ట్రెండ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాన వర్గంలో ఉన్న క్రేజ్ ఏమిటో మరోసారి బయటపడింది. “రత్నాపూర్ కా సర్ధార్ ఆగయా…” అంటూ ఎర్ర కండువా పట్టుకుని వెనక్కి తిరిగి ఉన్న పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ ‘ఈరోస్’ విడుదల చేసింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన విడుదల కాబోయే టీజర్ కు శాంపిల్ గా విడుదలైన ఈ పోస్టర్ పవర్ స్టార్ అభిమానులకు పిచ్చేక్కించింది.

విడుదలైన కొద్ది సమయంలోనే ఈ పోస్టర్ ను షేర్ చేసుకుంటూ పవన్ అభిమానగణం ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సందడి చేసారు. అంతేకాదు, ఒకానొక సమయంలో “నాన్నకు ప్రేమతో” సినిమా హంగామాను మించిపోయే స్థాయిలో ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా ‘ట్రెండ్’ అయ్యింది. కేవలం ఒక్క పోస్టర్ తోనే పవన్ సృష్టించిన హంగామా ఇది. ఇక, టీజర్ విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

సంక్రాంతి పండుగకు అందరి హీరోల అభిమానులు వెండితెర, బుల్లితెరలను ఎంచుకుంటే, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హంగామాకు సిద్ధమవుతున్నవారు. మరి విడుదల కాబోయే టీజర్ తో పవన్ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.

Share
Published by

Recent Posts

Jayam Ravi Drug Video: Real or AI? Internet in Shock

A leaked video of actor Jayam Ravi and his ex-girlfriend Keneeshaa smoking an illegal drug…

16 minutes ago

PVR Onion Pakodi at Rs. 250: Is This Daylight Robbery?

PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…

47 minutes ago