Telugu

“పెద్ది” సినిమా రివ్యూ: ఓకే ఓకే!

చిత్రం: పెద్ది

M9 రేటింగ్: 2.5/5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూన్ 04, 2026

తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు తదితరులు

నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్

దర్శకత్వం: బుచ్చి బాబు సానా

సంగీతం: రెహమాన్

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు

కూర్పు: నవీన్ నూలి

“ఉప్పెన” లాంటి మీడియం బడ్జెట్ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన బుచ్చిబాబు తన రెండో సినిమాగా తెరకెక్కించిన చిత్రం “పెద్ది”. రామ్ చరణ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఓపెనింగ్ రోజు నుండి మంచి బజ్ క్రియేట్ చేసింది. ట్రైలర్ తప్ప ప్రమోషనల్ కంటెంట్ అన్నీ కూడా ఆడియన్స్ ను విశేషంగా అలరించాయి. మరి సినిమాగా “పెద్ది” ఏమేరకు అలరించింది? బుచ్చి బాబు రెండో సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్నాడా? రాజమౌళి కర్స్ నుండి బయటపడి “ఆర్ఆర్ఆర్” తర్వాత చరణ్ హిట్ కొట్టాడా? అనేది చూద్దాం..!!

కథ:

పేరు కూడా లేని ఒక కొండ ప్రాంతానికి చెందిన ఆట కూలి పెద్ది (రామ్ చరణ్). జనాల చప్పట్ల కోసం క్రికెట్ ఆడుతూ.. డబ్బుల కోసం బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తూ.. నెలకోసారి కొండపైన ఉన్న తన ఊరికి వెళ్లి సేదతీరుతూ ఉంటాడు.

అయితే.. అప్పటివరకు పెద్దికి ఆటలో ఉన్న గుర్తింపు, వ్యక్తిగా అతనికి లేకపోవడం, దాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది.

ప్రభుత్వం తనను గుర్తించడం కోసం, తన గ్రామానికి ఒక రైల్వే స్టేషన్ సాధించుకోవడం కోసం పెద్ది ఏం చేశాడు? అందుకోసం ఏం కోల్పోయాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

నటుడిగా చరణ్ పట్టుదల, ఎదుగుదల చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఈతరం నటుల్లో పాత్ర కోసం ప్రాణం పెట్టే అతికొద్ది మందిలో చరణ్ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. కుస్తీ ఆటగాడిగా అతని ట్రాన్స్ఫర్మేషన్, బాడీ లాంగ్వేజ్ లో వైవిధ్యం చూపిన విధానంతోపాటుగా కళ్ళలో దిగులు, నిరాశ వంటి భావాల్ని పలికించిన తీరు ప్రశంసార్హం. ముఖ్యంగా హాస్పిటల్ సీన్ & క్లైమాక్స్ సీన్ లో చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి చాన్నాళ్లు మాట్లాడుకుంటారు.

జాన్వీ క్యారెక్టర్ తో వీలైనంత ఇరిటేట్ చేశాడు చిట్టిబాబు. చివర్లో ఆమె మెడలో తాళి పడేంతవరకు.. ఒక్క సీన్ లోనూ ఆమె పైట సరిగా ఉండదు, కొన్ని సందర్భాల్లో అసలు పైటే ఉండదు. ఎంత మోటు పాత్రైనా సరే.. కనీస స్థాయి విలువలు ఉండాలి కదా. అది కూడా ఎక్స్ ఎమ్మెల్యే కూతురు. అలాంటి అమ్మాయి స్టేజ్ మీద, మార్కెట్ బయట లో నెక్కు జాకెట్లు, నడుమంతా కనిపించేలా హాఫ్ శారీలు కట్టుకుని, ఏంటో ఈ లేకితనం అనిపించేలా ఉంది. క్యారెక్టర్ చిరాగ్గా ఉండడంతో.. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా చిరాగ్గానే అనిపించింది.

దివ్యేందు, శివరాజ్ కుమార్ వంటి నటులు తమ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నారు కానీ.. వారి క్యారెక్టర్ ఆర్క్స్ సరిగా రాసుకోకపోవడం వల్ల.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుంచుకొనే స్థాయిలో లేదు.

జగపతిబాబు మరో బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి పాజిటివ్ పాయింట్ గా నిలిచారు. ఆయన పాత్ర, ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకి కీలకమైన అంశంగా నిలిచింది.

సాంకేతికవర్గం పనితీరు:

రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ముఖ్యంగా ఆఫ్రికన్ బీట్ ఫార్మాట్ లో ఇచ్చిన బీజీయం క్రికెట్ & కుస్తీ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. అయితే.. అది సినిమా మొత్తానికి క్యారీ అవ్వకపోవడం మిస్. పాటలు కూడా జనాల్లోకి వెళ్లిపోవడం, రై రై రారా పాటను జనాలు ఎంజాయ్ చేయడం అనేది రెహమాన్ కి తెలుగులో మళ్లీ మంచి క్రేజ్ తీసుకొస్తుంది.

రత్నవేలు సినిమాటోగ్రఫీ ఫ్రేమింగ్స్ బాగున్నాయి కానీ.. విజువల్ బ్యూటీ కొరవడింది. DI కూడా కొన్ని సీన్స్ లో సరిగా లేదు. సీజీ వర్క్ ఇష్యూస్ ఎఫెక్ట్ అనేది రత్నవేలు వర్క్ మీద పడింది. చరణ్ ఎలివేషన్ షాట్స్ & క్రికెట్ షాట్స్ ను కంపోజ్ చేసిన విధానం అలరిస్తుంది.

నవీన్ నూలి ఎడిట్ వర్క్ మరోమారు మైనస్ గా నిలిచింది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ విషయంలో బేసిక్ కేర్ తీసుకోలేదు. శివరాజ్ కుమార్ కుస్తీ సీక్వెన్స్ లో చరణ్ ను ఎత్తుకొని గ్రౌండ్ లో విసిరేసే సీక్వెన్స్ వరకు సినిమాలో ఒక ప్రాపర్ ఎడిట్ ఫ్లో లేకపోవడం అనేది డిస్ట్రబింగ్ గా ఉంది. నవీన్ ను సోషల్ మీడియాలో మరోసారి ఫుల్లుగా ట్రోల్ చేస్తారు.
ప్రొడక్షన్ డిజైన్ వర్క్ విషయంలో తీసుకున్న కేర్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. పేలవమైన సీజీ వర్క్ వల్ల ఆ కొండ, ఊరు చాలా అసహజంగా కనిపిస్తాయి కానీ.. 1990 టైమ్ లైన్ ను రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అవినాష్ కొల్లా.

ఇక దర్శకుడు బుచ్చిబాబు విషయానికి వస్తే.. ఒక అగ్ర కథానాయకుడితో ఈతరహా క్లైమాక్స్ తో సినిమా తీయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్. అది కూడా ఎక్కడా ట్రోల్ అవ్వకుండా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలా చేయగలగడం అనేది మామూలు విషయం కాదు.. దాన్ని బాగా హ్యాండిల్ చేశాడు బుచ్చి బాబు. అయితే.. అప్పటిదాకా డ్రామాను సస్టైన్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. అలాగే.. ఒక సిన్సియర్ స్పోర్ట్స్ డ్రామాలో అనవసరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇరికించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. జాన్వీ క్యారెక్టర్ కావచ్చు, శృతి స్పెషల్ సాంగ్ కావచ్చు, సదరు టెంప్లేట్ ఎలిమెంట్స్ సినిమాకి మైనస్ గా నిలవడమే కాక.. ఒక రైటర్ గా బుచ్చిబాబు ఐడియాలజీకి మరకలుగా మారాయి. ఏదో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కదా అని, మరీ ఇలాంటి సీన్స్ పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ సన్నివేశాలు తీసేస్తే సినిమా ఇంకా బాగుంటుంది తప్పితే.. కనీసం ఫ్లో మిస్ అయిన భావన కూడా కలగదు. అలాగే.. మరాఠీ యాక్టర్ ఉపేంద్రను ఏరికోరి ఈ సినిమాలో ఎందుకు ఇరికించారో అర్థం కాలేదు, ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లిప్ సింక్ లేదు, ఎమోషన్స్ ను కూడా ఆయన సరిగా పండించలేకపోయాడు. సో, దర్శకుడిగా, రచయితగా బుచ్చిబాబు తన రెండో సినిమా విషయంలో మాత్రం బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశ్లేషణ:

థీమ్ లా చూస్తే “పెద్ది” ధ్యేయం అనేది చాలా రిలేటబుల్ & అడ్మైరబుల్ కథ. అయితే.. ఒక వ్యక్తి గుర్తింపు కోసం పడే తపనను, బాధను ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేయలేకపోయాడు బుచ్చిబాబు. అందువల్ల.. సినిమా ఒక పూర్తిస్థాయి సంతృప్తినివ్వలేకపోయింది. క్యారెక్టర్ ఆర్క్స్, స్టోరీలో ఫ్లో, ఎమోషనల్ డెప్త్ వంటి విషయాలను బుచ్చిబాబు పెద్దగా కేర్ చేయకపోవడం అనేది మరో మైనస్. ఇవన్నీ సరిపోవన్నట్లు జాన్వీ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆమె అందాలను కెమెరాతో అన్నీ యాంగిల్స్ లో తడిమిన విధానం ఇబ్బందికరంగా ఉండడం అనేది ఇంకాస్త ఎక్కువగా ఇరిటేట్ చేస్తుంది. అయితే.. రామ్ చరణ్ డెడికేటెడ్ పెర్ఫార్మెన్స్ కోసం, రెహమాన్ బీజీయం కోసం, రత్నవేలు ఫ్రేమింగ్స్ కోసం “పెద్ది” సినిమాని థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు!

ఓవరాల్ గా.. ఓకే ఓకే!

M9 రేటింగ్: 2.5/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

7 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

7 hours ago