
అయితే దానిపై మంత్రి పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు. “పోస్కో సంస్థ ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశారు. స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలంటే సీఎంను కలవాల్సిన అవసరం ఉండదు. ప్రధానిని లేదా కేంద్ర మంత్రులను కలిసేవారు. సీఎం కుట్ర చేశారని, స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతున్నారంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు,” అని చెప్పుకొచ్చారు.
నిజమే స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలంటే సీఎంను కలవాల్సిన అవసరం ఉండదు. కానీ దక్షిణ కొరియాకు సంబంధించిన ఒక కంపెనీ ప్రతినిధులు ఊరికే ఆంధ్రప్రదేశ్ రారు కదా? వారికి సీఎం ఎందుకు అప్పోయింట్మెంట్ ఇచ్చారు? వారు మూడు సార్లు విశాఖలో పర్యటించారని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారు.
వారు పర్యటించిన సంగతి కూడా రాష్ట్రప్రభుత్వానికి తెలీదా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావడం మాములే. అయితే ఇవేమి మాకు తెలీదు అసలు దానితో సంబంధం లేదు అని అధికారంలో ఉన్న వారు చెబితే నమ్మడం కష్టమే కదా? స్టీల్ ప్లాంట్ విషయం తమకు తెలీదని జగన్ ప్రభుత్వం బుకాయిస్తుంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ అంశం మీద ముఖ్యమంత్రి మీడియా ముందుకు రాలేదు. కేవలం నామమాత్రంగా ఒక లేఖ రాసి ఊరుకున్నారు.
Royal blue gets a fearless fashion upgrade as Preity Mukhundhan steps into the spotlight with…
Following the back to back failures of Madharaasi and Parasakthi, actor Sivakarthikeyan is currently starring…