Telugu

పవన్ కళ్యాణ్ కు 450 కోట్ల ప్యాకేజి దక్కిందట

Perni Nani allegations on pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా అంతే ఘాటుగా సమాధానం చెబుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి ఆయన సామజిక వర్గం నేతలనే జగన్ ఉపయోగించడం విశేషం. అందులోనూ ఆ బాధ్యతను పేర్ని నానికి అప్పగించినట్టుగా ఉంది.

ADVERTISEMENT

తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు గత ఎన్నికలలో 450 కోట్ల ప్యాకేజి ఇచ్చారని ఆరోపించారు. “సినిమాలలో నటిస్తే ఏముంది? మహా అయితే సినిమాకు యాభై కోట్లు ఇస్తారు. రెండు నెలల పాటు కష్టపడినందుకు చంద్రబాబు నుండి గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు 450 కోట్లు ముట్టాయి,” అని ఆయన ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద చేసే విమర్శలకు సమాధానం ఇవ్వకుండా కేవలం ఆయన చంద్రబాబు ఏజెంటు అని ప్రజల్లోకి గట్టిగా తీసుకుని వెళ్లగలిగితే సరిపోతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే వ్యూహంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఆ వ్యూహం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

మరోవైపు పవన్ కళ్యాణ్ రాయలసీమ యాత్ర కొనసాగుతుంది. పైగా ఎక్కువగా కడప సీఎం సొంత జిల్లా కడప మీద పవన్ ఎక్కువగా దృష్టి పెట్టడం విశేషం. ఆయన ప్రస్తుతం కడప జిల్లా పర్యటన ముగించుకుని చిత్తూరులో పర్యటిస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

PK Back In Films? Not in Near Future?

The deputy CM of Andhra Pradesh, Pawan Kalyan has another facet and it is regarding…

7 minutes ago

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

25 minutes ago