
ఈ సినిమాలో కీలక సన్నివేశంలో కథానాయిక గుండుతో కనిపించాల్సి ఉంటుంది. దీనిని మేకప్ ద్వారా చేద్దామన్నప్పటికీ, పాత్ర పండాలని పియా బాజ్ పేయ్ గుండు చేయించుకుంది. ఇలాంటి కథలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, విజయలక్ష్మి ఫోన్ చేసి కథ చెప్పగానే ఆకట్టుకుందని ఈ సందర్భంగా పియా తెలిపింది. నటీనటులు ఇలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తారని, తనను ఆ పాత్ర వెతుక్కుంటూ వచ్చి వరించిందని చెప్పింది.
మేకప్ తో నటిస్తే పాత్ర పండదనిపించడంతో గుండు చేయించుకున్నానని చెప్పింది. దీంతో దర్శకురాలే తన వద్దకు వచ్చి… సాధారణంగా గుండు గీయించుకునేందుకు ఏ అమ్మాయి అంగీకరించదని, అందులోనూ కథానాయికలు అస్సలు ఆ పని చేయరని చెప్పింది. తాను ఏదైతే కోరుకున్నానో అదే చేసి చూపించావని మెచ్చుకుందని తెలిపింది. ఈ సినిమా సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రాల సరసన నిలుస్తుందని పియా బాజ్ పేయి విశ్వాసం వ్యక్తం చేసింది.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…