
వాల్మీకి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా చిన్నది. ఒక సాంగ్, కొన్ని సీన్లు. జస్ట్ 10 రోజుల వర్క్. ఆ మాత్రం దానికి అమ్మడు కోటిన్నర పట్టేసిందట. డిమాండ్ ఉండగానే కాసిన్ని డబ్బులు వెనకేసుకోవాలని చూస్తున్నట్టుంది ఈ కన్నడ భామ. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. మొన్నామధ్య ఈ సినిమా టైటిల్ పై వివాదం చెలరేగింది.
గ్యాంగ్ స్టర్ సినిమాకు ‘వాల్మీకి’ అనే పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. వారి గొడవ కారణంగా అనంతపురంలో జరగాల్సిన షూటింగ్ ఆగిపోయింది. సినిమా పబ్లిసిటీ మొదలు పెట్టే సమయానికి ఈ వివాదం మళ్ళీ తెర మీదకు వస్తుందేమో అని మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 వంటి వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో తన హిట్ల పరంపరను కొనసాగించాలని ఆరాటపడుతున్నాడు.
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…
Namit Malhotra’s Ramayana has crossed $517K in US premiere advance sales, but the numbers reveal…