
ఆ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ కూడా బయటకు వచ్చింది. ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ పేరుతో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ప్రభాస్ మునుపటి లుక్ లోనే దర్శనమిస్తున్నాడు. పెరిగిన గడ్డం, జుట్టు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ‘బాహుబలి’ సినిమా మాదిరిగా ఉన్నాయి.
అయితే ఈ సినిమాలో మాత్రం తమ అభిమాన హీరో నుండి బెస్ట్ అవుట్ పుట్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘బాహుబలి’ సినిమా ఎంత విజయం సాధించినా, దానిలో 90 శాతం పైగా సక్సెస్ క్రెడిట్ రాజమౌళికే దక్కింది. ఆ మిగిలిన శాతాన్నే రానా, రమ్యకృష్ణ, కట్టప్ప, సినిమా సాంకేతిక నిపుణులతో పాటు ప్రభాస్ పంచుకున్నారు. కానీ, ఈ సినిమాలో మాత్రం తమ హీరో దుమ్ము లేపాలని ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు ఏ విధంగా నేరవేరతాయో తెలియాలంటే మరి కొన్ని నెలల పాటు వేచి చూడక తప్పాదు.
Gopichand Malineni found the right formula for Sunny Deol in Jaat. He understood the veteran…
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…