ప్రభాస్ తో ‘లవ్ స్టోరీ’ అంట! కొత్తగా ఉంది కదూ..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, సంబంధాలు చూడడమే ఆలస్యమని, బాధ్యత తమపైనే ఉందని, బహుశా “బాహుబలి 2” అయిపోయే నాటికి అన్ని పనులు పూర్తవుతయోమోనన్న ఆశాభావాన్ని ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు వ్యక్తపరిచారు. జనవరి 20వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణంరాజు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ తో ఒక ప్రేమకథ చిత్రాన్ని నిర్మించబోతున్నానని, అయితే ‘బాహుబలి’ వంటి సినిమా తర్వాత ప్రభాస్ ను ప్రేమకథలో చూడగలరా… అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారని, తన కెరీర్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఖచ్చితంగా ప్రభాస్ తో లవ్ స్టోరీని తీస్తానని కృష్ణంరాజు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ పెదనాన్నగా ప్రస్తుతం ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా గుర్తుపడుతున్నారని, తనకు ఇంతకంటే కావాల్సింది ఏముంటుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

రాజకీయ పరమైన అంశాలపై కూడా స్పందించిన కృష్ణంరాజు, “బీజేపీలోనే ఉన్నానని, బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేయగా, కొన్ని సార్లు అన్నీ అనుకున్నట్టు జరగవని, రాజకీయాల పేరిట ప్రతిసారీ ప్రజల్లోకి వెళ్లడం తనకు కుదరదని” అన్నారు.

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

29 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

52 minutes ago