Telugu

ప్రభాస్ ఈసారి ఇలా హిట్ కొడతాడా ?

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వేచి చూస్తున్న ‘రాధే శ్యామ్’ టీజర్ రిలీజైంది. నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విక్రమ్ ఆదిత్య క్యారెక్టర్ టీజర్ వదిలి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ప్రభాస్ సినిమా అంతా అల్ట్రా స్టైలిష్ లుక్ లో క్లాస్ గా కనిపించనున్నాడు. ఆ విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఐదు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఒకే టీజర్ కట్ చేశారు. అందుకోసం ఇంగ్లీష్ లోనే డైలాగ్స్ పెట్టేసి విడుదల చేశారు. సినిమా టీజర్ లో ఇంగ్లీష్ డైలాగ్స్ పెట్టడం తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచేలా ఉంది. ఇక మాస్ ఆడియన్స్ కి కూడా అర్థమయ్యేలా తెలుగులో సబ్ టైటిల్స్ వేశారు.

‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ కి రీచ్ అయిపోయాడు. ఇకపై ఈ స్టాండర్డ్స్ మైంటైన్ చేయక తప్పదు. అందుకే రాధా కృష్ణ ముందు రాసుకున్న వెర్షన్ కూడా మారిందని ఇన్సైడ్ టాక్. ఇక సినిమా స్టాండర్డ్స్ ఏంటో… మేకర్స్ ఏ రేంజ్ లో ఖర్చు పెట్టారో టీజర్ లో కనిపించిన ప్రతీ ఫ్రేమ్ చెప్తోంది. ముఖ్యంగా వైభవి మర్చెంట్ విజువల్స్ , బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మిథూన్, అమాల్ మాలిక్ ,మనన భరద్వాజ్ బీజీఎం హైలైట్స్ గా నిలిచాయి.

ADVERTISEMENT

బర్త్ డే టీజర్ కాబట్టి కేవలం ప్రభాస్ క్యారెక్టర్ టీజర్ తో సరిపేట్టేశారు మేకర్స్. త్వరలోనే మరో టీజర్ కూడా కట్ చేయనున్నారని తెలుస్తుంది. తర్వాత రిలీజ్ కి ముందు ట్రైలర్ ఎలాగో ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి బరిలో భారీగా రిలీజ్ అవ్వనుంది. మరి ఈ క్లాస్ సినిమాతో ప్రభాస్ క్లాసిక్ హిట్ అందుకుంటాడా వెయిట్ అండ్ సీ.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Ramayana Inside Reports: Great Visuals, Weak Emotions?

An alleged inside report on Bollywood's magnum opus Ramayana Part 1 claims that the film…

4 minutes ago

DSP’s Yellamma Set for Pre-Summer Release

Following the success of Balagam, National Award-winning filmmaker Venu Yeldandi is working on his next…

23 minutes ago