
తాజాగా విడుదలైన టీఆర్పీ లెక్కల ప్రకారం సాహూ వరల్డ్ టీవీ ప్రీమియర్ కు 128.20 లక్షల వ్యూయర్ షిప్ ఇంప్రెషన్స్ వచ్చాయట. దీనితో సాహూ అత్యధిక రేటింగ్స్ సాధించిన హిందీ సినిమాలలో ఐదో ర్యాంకుకు చేరింది. హౌస్ ఫుల్ 4, టోటల్ ఢమాల్, 2.0 (హిందీ), కేసరి మాత్రమే సాహూ కంటే ఎక్కువ రేటింగ్స్ సాధించాయి.
సల్మాన్ ఖాన్ భారత్, హ్రితిక్ రోషన్ సూపర్ 30 కంటే సాహూ కే ఎక్కువ రేటింగ్స్ రావడం గమనార్హం. ఇది హిందీ మర్కెట్స్ లో ప్రభాస్ పాపులారిటీని సూచిస్తుంది. ఇది ఇలా ఉండగా.. ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ అనుకుంటున్నారని వినిపిస్తుంది.
1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ అంటున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చే నెల 25న ఉగాది సందర్భంగా విడుదల చెయ్యబోతున్నారని సమాచారం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. సాహూ సినిమా లాగానే ఓ డియర్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…