
వీడియోలో చూపించిన విజువల్స్ బట్టి సినిమాలో ఫైట్లు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే సహజంగా ఇలా భారీ సినిమాలు తీసేటప్పుడు, డైరెక్టరు గతి తప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు కథ మీద కంటే స్టయిల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి మొదటికే మోసం తెస్తారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సుజిత్ ఏం చేశారో చూడాలి. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, నీల్ నితిన్ ముఖేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తోంది. దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఈ ఏడాది ఆగష్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం బాషలలో సినిమా విడుదల చెయ్యబోతున్నారు. బాహుబలి సక్సెస్ విడుదల కాబోతున్న ప్రభాస్ సినిమా ఇదే కాబట్టి ఈ సాహో మీద భారీ అంచనాలే ఉన్నాయి అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ. ఈ సినిమా గనుక పెద్ద హిట్ అయితే ప్రభాస్ ఇంకా వెనక్కు తిరిగి చూసుకోనక్కర్లేదు.
An Indian national on a student visa has been detained in the United States over…
ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్…