
ప్రత్యూష బెనర్జీ కెరీర్ పరంగా పతాక స్థాయిలో ఉన్నపుడే రాహుల్ పరిచయం పెంచుకుని ప్రేమలోకి దింపాడు. ఈ క్రమంలోనే ప్రత్యూషను నమ్మించేందుకు ముంబైలో తనకు నాలుగు ఫ్లాట్ లు ఉన్నాయని, సొంత ఊళ్లో 150 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అబద్ధాలు చెప్పిన రాహుల్, తన తల్లి ఎమ్మెల్యే అని కూడా కాకమ్మ కబుర్లు చెప్పాడు. అయితే, అప్పటికే రాహుల్ కు మరొక మహిళతో ఉన్న సంబంధం కారణంగా తొమ్మిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
అలా ప్రత్యూష జీవితంలోకి ప్రవేశించిన రాహుల్ రాజ్ సింగ్, తరువాత ప్రత్యూషతో స్నేహితులు ఎవరూ కలవకూడదని ఆంక్షలు విధించాడు. కాలక్రమేణా ఆ ఆంక్షలు ప్రత్యూష కుటుంబానికి కూడా చేరువయ్యాయి. కేవలం తనతోనే ఉండాలనే షరతుతో, కుమార్తె జీవితం ముఖ్యమని భావించిన కుటుంబ సభ్యులు ఆమెను విడిచి వెళ్లారు. అయితే తనతో పాటే ఒంటరిగా ఉన్న ప్రత్యూషను పాత సంబంధాలను గుర్తుచేసి దారుణంగా కొట్టేవాడని, రాహుల్ కొట్టినప్పుడల్లా గట్టిగా అరుపులు వినిపించేవని, ఇరుగు పొరుగు వారు చెప్తూ ఉండేవారని చెప్పారు.
స్వార్ధంతో రాహుల్ చేసిన అప్పులు పెరిగిపోయి, వారు నివసించే ఇంటి అద్దె కట్టడం కూడా కష్టంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులకు తోడు శారీరక హింస కూడా పెరిగిపోవడంతో ప్రత్యూష తన అంకుల్, ఆంటీలతో బాధలు పంచుకుందని తల్లితండ్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ ‘కధ’లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి కాకుండా రాహుల్ తో ఉండేందుకు తల్లితండ్రులు ఎందుకు అంగీకరించారు? తనకున్న బాధలను పేరెంట్స్ తో కాకుండా ఆంటీ, అంకుల్ లతో ప్రత్యూష పంచుకుందంటే… తల్లితండ్రులతో ఆమె సఖ్యతగా లేదా? ప్రియుడు – తల్లితండ్రుల మధ్య నలిగిపోవడమే ప్రత్యూష ఆత్మహత్యకు అసలు కారణమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి నిజాలు ఏమిటో పోలీసులే బయటపెట్టాలి.
For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…