
అయితే మళ్ళీ చాలాకాలం తర్వాత “క్వీన్” సినిమా రీమేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సారి తెరపైకి వచ్చిన మహారాణి “ప్రేమమ్” సినిమా హీరోయిన్ పార్వతి. సినీ విమర్శకుల ప్రశంసలతో పాటు యువతరం మనసు దోచుకున్న యువ కధానాయక పార్వతి ఈ ‘క్వీన్’ సినిమా రీమేక్ కు ఓకే చెప్పినట్లుగా మీడియాలో వర్గాల్లో కధనాలు ప్రసారమవుతున్నాయి.
‘క్వీన్’ సినిమా రీమేక్ లో కంగనా పాత్ర కోసం అందం, అభినయం కలగలిసిన పార్వతిని ఎంపిక చేయగా, ఒకప్పటి అందాల రాణి అయిన సుహాసిని తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారని.., అలాగే, నటనలో రాణి అయిన రేవతి ఈ సినిమా కోసం ‘కలం’ కదపనున్నారని… తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురు మహారాణులు “క్వీన్” సౌత్ రీమేక్ కోసం ఒక్కటయ్యారన్న మాట.
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…