
అలాంటి నట్టికుమార్, తొలిసారిగా ఓ పెద్ద సినిమాను, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడడం విశేషం. మార్చి 24న విడుదల కాబోయే “కాటమరాయుడు” సినిమా అంచనాలకు మించి ఉంటుందని, ఈ సినిమా ఆల్ రెడీ సూపర్ హిట్ అని, అసలు పవన్ కెరీర్ లో ఫ్లాప్ లేదని, ఎప్పుడో కెరీర్ తొలినాళ్ళల్లో ఒకటి మాత్రమే ఉందని, పవన్ సినిమా ఫ్లాప్ అంటే అది యావరేజ్ అని, అలాగే యావరేజ్ అంటే సూపర్ హిట్ అని, ఇక బాగుంది అంటే దానికి చెప్పనవసరం లేదని పవన్ మీద విపరీతమైన ప్రేమను కురిపించారు.
అలాగే ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాకు నష్టాలు వచ్చాయని చెప్తున్న నైజాం డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ వ్యాఖ్యలు అర్ధరహితమని, గతంలో తనకు ‘లింగా’ సినిమాను 3.60 కోట్లకు అమ్మితే, నాకు వచ్చినవి కేవలం 70 లక్షలు మాత్రమేనని, ఆ సమయంలో తాను వెళ్లి అడిగితే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తానని చెప్పిన దిలీప్ టాండన్ గారు ఇప్పుడెలా ప్రశ్నిస్తున్నారని, అసలు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ కలెక్షన్స్ బయటపెట్టారా? ఎవరో ఒకరిద్దరికి నష్టం వస్తే అది పవన్ చూసుకుంటారు తప్ప, నైజాంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’కు ఎలాంటి నష్టం రాలేదన్న విషయం అందరికీ తెలుసనీ, ‘సర్ధార్’ కలెక్షన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నట్టికుమార్ ఇదంతా మాట్లాడడంలో అర్ధముంది. అయితే ఒక్కసారిగా పవన్ సినిమాలపై ఫోకస్ పెట్టడం, పవన్ ను ఆకాశానికెత్తేయడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బహుశా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’పై వస్తున్న డిస్ట్రిబ్యూటర్ల దాడులకు నిర్మాణ సంస్థ నట్టికుమార్ తెరపైకి తీసుకువచ్చిందా? లేక ‘కాటమరాయుడు’ సినిమాకు ఎగ్జిబిటర్ గా నట్టికుమార్ కు అవకాశం లభించిందా? అన్న సందేహాలను సినీ జనాలు వ్యక్తపరుస్తున్నారు.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…