
[m9ad]
వైకాపా ఎంపీలు చేపట్టిన వంచనపై దీక్షకు హాజరయ్యి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత నేత ఎన్టీఆర్ పంచెను ఊడదీసి డిల్లీలో ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీకి శాలువా మాదిరి కప్పారని ఆయన అక్షపించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన మోసం ఇంత అంతాకాదని పైగా తగుదునమ్మా అంటూ రాహుల్ తోకలిసి తెలంగాణలో మహాకూటమి కట్టి తెలుగువారి పరువు తీశారని,ప్రజలు కూడా వారికి గుణపాఠం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదాపైనా మహాకూటమి పైనా ఆరోపణలు చెయ్యడం వరకు ఒకే… కాకపోతే శృతి మించి ఎన్టీఆర్ పంచె ఊడదీశారు లాంటి మాటలు మాట్లాడం పృథ్వి లాంటి సినిమా యాక్టర్లకు మంచిది కాదు. పైగా ఆయన ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి నందమూరి కుటుంబసభ్యులతో పని చెయ్యడం కూడా ఆయనకు ఇబ్బందే. ఆయన ప్రత్యేక్ష రాజకీయాలలో ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఒక అర్ధం ఉంది. కేవలం అభిమానంతో ఏదో సపోర్టు ఇస్తున్నప్పుడు ఏదైనా వేదిక మీద మాట్లాడమా… పార్టీకీ నాయకుడికీ అనుకూలంగా నాలుగు మాటలు మాట్లాడమా అన్నట్టు ఉంటే ఆయనకే మంచిదే.
While many Bollywood stars today focus on aggressive PR and avoid releasing multiple movies per…
A viral claim suggesting petrol and diesel prices could rise by Rs. 25-28 per liter…