Telugu

పూరి జగన్నాధ్ కు పూర్వవైభవం రావడం కష్టమేనా?

ఒకప్పుడు వరస హిట్స్ తో తెలుగు తెరను ఏలిన పూరి జగన్నాథ్ ..గత కొంతకాలంగా హిట్ అనేది మర్చిపోయారు. దాంతో ఆయనతో పనిచేయటానికి పెద్ద హీరోలు ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ఆయన తయారు చేసే కథల్లో గ్రిప్ ఉండటం లేదని, గతంలోలాగ ఇంట్రస్టింగ్ డైలాగులు రాయలేకపోతున్నారని చాలా మంది అభిప్రాయం. అందుకు తగ్గట్లే ఒకదాని తరువాత ఒకటి వచ్చిన ప్లాపులు పూరిలో పస అయిపోయిందని ప్రూవ్ చేసాయి. ఈ నేపధ్యంలో రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజైంది. సినిమా మంచి విజయం దిశగా ముందుకు వెళ్తుంది.

అయితే ఇప్పటికైనా పూరికి మన స్టార్ హీరోలు అవకాశం ఇస్తారా అంటే అనుమానమే. స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇచ్చేలా ఉంటే ఈ పాటికి ఆయనకు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసేవారు. అంటే వాళ్లకు ఇస్మార్ట్ శంకర్ హిట్ …సరిపోవటం లేదన్నమాట. దానికి తోడు ఇస్మార్ట్ శంకర్ క్రెడిట్ మొత్తం రామ్ కే వెళ్లిపోయింది. మార్కెట్లో సరైన మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవటం కూడా ఈ సినిమా కు బాగా ప్లస్ అయ్యింది. కాబట్టి ఇస్మార్ట్ శంకర్ సినిమాని స్టార్స్ పెద్ద హిట్ గా పరిగణించటం లేదు.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా పూరి మహేష్ బాబు కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. హిట్స్ లో ఉంటే తప్ప మహేష్ బాబు తనతో సినిమా చెయ్యడని ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యాకా అవకాశం ఇచ్చినా ఒప్పుకోవడానికి తన ఆత్మాభిమానం ఒప్పుకోదన్నట్టు పూరి చెప్పాడు. ఒక స్టార్ హీరో మీద ఇటువంటి కామెంట్స్ చెయ్యడం సాహసమే. సహజంగా మన స్టార్లు ఇలాంటి దర్శకులకు కొంత దూరంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా పూరి కథ విని నచ్చలేదు అని అంటే మీడియా ముందుకు వెళ్లి ఏం చెప్తాడో అనే భయంతో. దాంతో ఎవరూ పూరితో చేయటానికి ఆసక్తి చూపటం లేదని సమాచారం.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Trisha’s Roadshow Turns Political, But She Stays Silent

Trisha Krishnan went to Coimbatore to open a mobile showroom, but the visit turned into…

33 minutes ago

Nayanthara’s Star Power Meets A Buzz Challenge

In an industry where towering cutouts are usually associated with male stars, Nayanthara is getting…

1 hour ago