
అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో పూరి తన పైత్యం మరోసారి చుపించాడంటూ విమర్శలు వస్తున్నాయి. సినిమా కూడా ట్రైలర్ లానే ఉంటే పూరికి మరో ప్లాప్ ఖాయం అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. రామ్ ఈ సినిమాలో రౌడీ గానూ పోలీసు గానూ కనిపిస్తాడట. గతంలో మహేష్ బాబు – పూరి ఇండస్ట్రీ హిట్ సినిమాలో కూడా మహేష్ బాబు పోలీస్ అన్న విషయం దాచిపెట్టాడు
ఇప్పుడు ఆ సీక్రెట్ ఇస్మార్ట్ శంకర్ కు వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. 18న బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు కూడా రావాల్సి ఉండగా అది చివరి నిముషంలో వాయిదా పడింది. దీనితో ఇస్మార్ట్ శంకర్ కు సోలో రిలీజ్ దొరికినట్టే. 19న సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమా విడుదల ఉన్నా అది అసలు లెక్కలోకే రాదు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…