
మునుపటి సినిమాలతో పోలిస్తే వరుణ్ తేజ్ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనపడతాడని, బాగా నటించాడని, ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో వరుణ్ ఇరగదీసాడని, ఈ సినిమాలో తల్లిని చూస్తూ వరుణ్ పాడే ఏడుపు పాట గురించి చిరంజీవి గారు పది నిముషాలు మాట్లాడారని, భవిష్యత్తులో వరుణ్ మంచి స్టార్ అవుతాడని కొనియాడారు. వరుణ్ పై ఇన్ని ప్రశంసలు కురిపించిన పూరీ, ఓ విభాగంలో మాత్రం వరుణ్ పెద్దగా రాణించలేదని నిర్మొహమాటం లేకుండా చెప్పారు.
మెగా హీరోలు ఏం చేసినా, చేయకపోయినా డ్యాన్స్ లు ఇరగదీసేస్తారని పేరు. పవన్ ఇందుకు మినహాయింపు లేండి! ఇపుడు వరుణ్ కూడా అదే జాబితాలో చేరాడని పూరీ చెప్పుకొచ్చారు. చెర్రీ, బన్నీల మాదిరి వరుణ్ పెద్దగా డ్యాన్స్ లు చేయలేదని, నిజానికి వరుణ్ కు ఆ అవసరం కూడా లేదని అన్నారు. అంటే, వరుణ్ బాగా నటిస్తున్నాడు కాబట్టి డ్యాన్స్ లు చేయనవసరం లేదన్న అభిప్రాయాన్ని పరోక్షంగా పూరీ వ్యక్తపరిచారు. మరి చెర్రీ, బన్నీలు ఎందుకు డ్యాన్స్ లు ఎందుకు చేస్తున్నట్లు? అన్న ప్రశ్న తలెత్తితే… జవాబు కూడా పూరీ మాటలోనే ఉందనుకుంటా… అని! అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…