
పూరీ మైక్ తీసుకోగానే ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అంటూ నినాదాలు చేయడంతో మరోసారి చేసేదేమీ లేక పవన్ ‘భజన’ చేసారు పూరీ. “పవన్ కళ్యాణ్ మీకు పవర్ స్టార్ అయితే, నాకు దేవుడు” అని పూరీ అనగానే అభిమానగణం అని చెప్పుకునేవారంతా ఈలలు, చప్పట్లతో ఆడిటోరియంను మారుమ్రోగించారు. ఈ సన్నివేశం చూడడానికి ఎలా ఉంటుందంటే… బలవంతంగా పూరీ చేత పవన్ ను పొగడ్తలతో ముంచెత్తినట్టు ఉంది. పూరీ అతిశయోక్తులతో పవన్ ను పొగుడుతుంటే, అభిమానులు ఊప్పొంగడం చూసి… నెటిజన్లంతా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
రోజురోజుకూ హద్దులు దాటుతున్న వీరి చేష్టలు సెలబ్రిటీలతో పాటు, వీక్షకుల సహనాన్ని కూడా పరీక్షించే విధంగా ఉంటున్నాయని, ఇలాంటి ‘పైశాచికత్వం’ ప్రదర్శించడం వలన వీరికి కలిగే ప్రయోజనం ఏమిటో తెలియడం లేదని వాపోతున్నారు. ఈ రోజు పవన్ అభిమానులే ఇలాంటి వాటికి కేంద్ర బిందువుగా నిలువవచ్చు, కానీ ఇలాంటి అర్ధ రహితమైన ప్రేలాపనలను మరొక అభిమానగణం ఆదర్శంగా తీసుకుని ప్రదర్శిస్తే, ఆహ్వానితుల పరిస్థితి ఏం కానూ..! అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరుగుతోంది.
Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…
Toxic was expected to be a huge blockbuster for Yash. Instead, the film’s disastrous theatrical…