
రియాల్టీ షో తర్వాత అటు సినిమాల్లో పాటలు పాడుతూ.. ఇటు బయట స్పెషల్ ప్రోగామ్స్ ఇస్తూ చాలా బిజీగా అయిపోయాడు రాహుల్. మొన్న ఆ మధ్య కొత్తగా ఒక బెంజ్ కార్ కొన్నాడు. ఇప్పుడు కొత్త ఇల్లు కొన్నారట. ఈ విషయాన్ని ఆయనే ఇన్ స్టా వేదికగా తెలిపారు. కారు కొన్నప్పుడు చాలా మంది ఇల్లు లేకుండా కారు కొన్నారా అని అడిగారట.
దీంతో రాహుల్ తాజాగా ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తాను చాలా రోజుల క్రితమే ఇల్లు కొనుగోలు చేశానని, ఆ తర్వాతే కారు కొన్నానని తెలిపారు. కనుక ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు. ఫ్లాట్ కొనేశా. అది రెడీ కావడానికి ఏడు నెలలు పడుతోంది. ఫ్లాట్ కొన్న తర్వాతే కారుకి గాలం వేశా. కనుక టెన్షన్ పడకండి. జస్ట్ చిల్ అని రాహుల్ పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా రాహుల్ కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నట్టు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో రాహుల్ వెండితెరకు నటుడిగా పరిచయం కానున్నారు. మరిన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ విన్ అయితే అంతగా పని అవుతుందా? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…