Telugu

బాబు పూరి ఇదీ నీ రేంజ్ !

హీరోలకు స్టార్డం అందించాలంటే పూరి తర్వాతే ఎవరైనా. కానీ ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ మినహా పూరీ తీసిన సినిమాలు జనాలకి ఎక్కలేదు. అయితే ఉన్నపళంగా ఒకప్పటి పూరి గుర్తుచేసి పూరి ది గ్రేట్ అనేలా చేసాడు రాజమౌళి.

ADVERTISEMENT

శ్రీకాకుళంలో జరిగిన ఓ ప్రయివేట్ ఈవెంట్ కి గెస్ట్ గా ఎటెండయిన రాజమౌళి అక్కడ జనాలతో ఇంటరాక్ట్ అయ్యారు. అందులో భాగంగా అక్కడి ప్రేక్షుకులు జక్కన్న కి కొన్ని ప్రశ్నలు వదిలారు. దానికి పెర్ఫెక్ట్ జవాబిలిచ్చి క్లాప్స్ , విజిల్స్ కొట్టించుకున్నాడు.

ప్రభాస్ లో ‘ఛత్రపతి’ నుండి ‘బాహుబలి’ వరకూ నటుడిగా ఎలాంటి చెంజోవర్ ఉంది ? అనే ప్రశ్న ఎదురైంది. ఎస్ చాలా ఛేంజ్ ఉంది.. అంటూ ‘బుజ్జి గాడు’ సినిమాను నొక్కి పట్టి చెప్పాడు జక్కన్న.

బుజ్జిగాడు ప్రభాస్ లో బిగ్గెస్ట్ ఛేంజ్ తీసుకొచ్చింది.అప్పటి వరకూ ఒకలా కనిపించిన ప్రభాస్ అక్కడి నుండి నటుడిగా చాలా ఛేంజ్ అయ్యాడు. ఆ క్రెడిట్స్ పూరి కే దక్కుతుంది. ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా అందరికీ ఒక ఛేంజోవర్ ఇచ్చి మాస్ కి , యూత్ కి బాగా దగ్గర చేసాడు పూరి జగన్నాథ్. అంటూ పూరి గతాన్ని గుర్తుచేస్తూ అతని పూర్వ వైభవం తాలూకు పరిమళాన్ని తన మాటల ద్వారా చూపించాడు.

రాజమౌళి చెప్పింది నిజమే. ఇప్పుడున్న స్టార్ హీరోలకు తన క్యారెక్టరైజేషన్ తో వాళ్లలో చాలా మార్పు తెచ్చాడు పూరి. కానీ ఇప్పుడు పూరి సినిమాల్లో అది మిస్ అవుతుంది. ఇస్మార్ట్ తో రామ్ ని కూడా మార్చేసి కొత్తగా పరిచయం చేసిన పూరి ఇప్పుడు విజయ్ దేవర కొండని ఎలా ప్రెజెంట్ చేస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

Aadarsha Kutumbam: Can the Trailer Change the Game?

After a couple of postponements, Venkatesh’s Aadarsha Kutumbam is finally set to release on October…

9 minutes ago

Divine Action: Tollywood’s New Favourite Formula?

Divine action seems to be slowly becoming a trend in Tollywood. These days, even when…

39 minutes ago