
“మొదట్లో ఈ సినిమాకు రామ్ చరణ్ 30 రోజుల కాల్ షీట్లను కావాలని అనుకున్నారు. అయితే ఇది రాజమౌళి కుదరదు అని చెప్పేశారు. కాబట్టి, కొరటాల దీనిని 15-20 రోజుల వరకు తగ్గించాలని యోచిస్తోంది” అని చిత్ర యూనిట్ లో ఉన్న ఒకరు చెప్పారు. 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్గా ఆర్ఆర్ఆర్ విడుదల ప్లాన్ చేసారు.
ఐతే ఇప్పుడు వాయిదా పడే అవకాశం ఉంది. కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా తప్పని విరామం కారణంగా ఈ చిత్రం సమ్మర్ 2021 కు నెట్టబడవచ్చు. ఆ సందర్భంలో కూడా 30 రోజుల పాటు రామ్ చరణ్ ను వదలడానికి రాజమౌళి సిద్ధంగా లేరు. ఆర్ఆర్ వాయిదా పడటం జరిగితే ఆచార్య సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఆచార్యలో చిరంజీవి ఒక మాజీ నక్సలైటుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఎండోమెంట్స్ విభాగంలో అవినీతికి సంబంధించిన సబ్జెక్టు గురించని సమాచారం. చాలా ఏళ్ల తరువాత మణి శర్మ చిరంజీవితో కలిసి ఈ చిత్రంలో పనిచేస్తున్నారు. గతంలో వారిద్దరూ సెన్సషనల్ ఆల్బమ్స్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుంది.
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan's office has strongly denied social media rumours claiming…
The Telugu film industry has had a strange trend for the last few years. Films…