
ఏదైనా ఇంటర్వ్యూలో దాని గురించి అడిగితే పవన్ కళ్యాణ్ గురించి రాజమౌళి చాలా గొప్పగా మాట్లాడేసి ఊరుకుంటారు. ఇప్పుడు రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ కూడా అలాగే వ్యవహరించారు. ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ ను డైనమైట్ తో పోల్చి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
“డైనమైట్ని పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలు. ఆయన పెద్ద డైనమైట్. కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలలో అక్కడక్కడా కొన్ని సీన్స్ తీసుకుంటే కథ తయారవుతుంది. ఆయనను చూడడానికే జనాలు వచ్చేస్తారు.. అమ్మాయిలతో పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, విలన్లను విరగ్గొట్టడం.. ప్రజలకు కాస్త మంచి చేయడం. ఇవి ఉంటే చాలు” అని చెప్పుకొచ్చారు.
అయితే ఇటువంటి ఐస్ పెట్టే మాటలు చాలానే విన్నాం… అవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ తో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఒక సినిమా తీసి పవన్ పై తమ అభిమానాన్ని నిరూపించుకోవాలని వారు అంటున్నారు.అయితే రాజమౌళి, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చూస్తే అది సాధ్యమయ్యేలా లేదు.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…