
రాజమౌళి సినిమా అంటే ఇక మారు మాట్లాడేది ఏముంది? పైగా బాహుబలి తరువాత చేసే సినిమా ఇది. అయితే కరోనా కారణంగా ఇంకో ఏడాది సినిమా విడుదల ఆగిపోయింది. దీనితో మూడేళ్లకు పైగా హీరోలు ఈ ప్రాజెక్టులో చిక్కుబడిపోయారు. మొదట్లో సినిమా విడుదల అయ్యే వరకు వేరే సినిమా చెయ్యకూడదు అన్న రాజమౌళి ఆ తరువాత షూటింగ్ పూర్తి అయ్యే వరకు అని కండిషన్ సడలించాడు.
ఇప్పుడు ఇంకొంచెం పంతం వీడి షూటింగ్ అవ్వకుండానే రామ్ చరణ్ ని ఆచార్య చెయ్యనిస్తున్నాడట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకు అందుబాటులో ఉండేలా పర్మిషన్ ఇచ్చాడు. దాని ప్రకారం ఈ నెల మూడో వారం లో మూడు రోజుల పాటు ఆచార్య షూటింగ్ కు చరణ్ డేట్ లు కేటాయించాడు. ఈ షూట్ లో చరణ్ మీద వున్న సొలో సీన్లు చిత్రీకరిస్తారు.
ఫిబ్రవరిలో కొన్ని రోజు చిరంజీవి తో కాంబినేషన్ సీన్లు తీస్తారు. మార్చిలో మరికొన్ని సోలో సీన్లు తీస్తారు. ఈ మధ్యలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా చేస్తాడు. అయితే డేట్స్ విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రాజమౌళికే. ఏది ఏమైనా ఇప్పుడు ఆచార్య టీమ్ ఊపిరి పీల్చుకుంది. త్వరగా షూట్ పూర్తి చేసి మే నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది.
For a change, it is the senior heroes who seem to be having the last…
ఈ స్థానిక ఎన్నికలు టీడీపీ, జనసేనల గెలుపోటములకు కాక, వాటి ఐక్యతకు పరీక్షగా మారాయనిపిస్తుంది సోషల్ మీడియాలో జరుగుతున్న భీకర…