
ఇదిగో అయిపోయింది అదిగో అయిపోతుంది అంతరుగానీ టీవీ సీరియల్ లా సాగిపోతూనే ఉంటుంది రాజమౌళితో వ్యవహారం. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తరువాత ఒక నెల విశ్రాంతి తీసుకుంటే జూన్ నాటికి గానీ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే అవకాశం లేదు. గత ఏడాది వేసవి కి ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.
గత ఏడాది సంక్రాంతికి అల వైకుంటాపురములో తో పెద్ద హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఏడాదిన్నర పాటు అసలు నెక్స్ట్ సినిమా కూడా మొదలుపెట్టలేని పరిస్థితి. 2018 అక్టోబర్ లో విడుదలైంది ఎన్టీఆర్ చివరి సినిమా అరవింద సమేత. రామ్ చరణ్ కు ఆచార్య రూపంలో ఆర్ఆర్ఆర్ కు ముందే ఒక సినిమా విడుదల అవుతుంది. అయితే ఎన్టీఆర్ అభిమానులకు ఆ అవకాశం కూడా లేదు. త్రివిక్రమ్ సినిమాతో పాటు ఎన్టీఆర్ జెమిని టీవీకి ఒక టీవీ షో చేస్తాడని కూడా సమాచారం.
అటువంటి పక్షంలో త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ విడుదల కాదు. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా కనిపించనున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ హీరోయిన్ నటిస్తుంది.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…