Telugu

జక్కన్న పెద్ద రికార్డు కే ఎసరు పెట్టాడు !

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లను పెట్టి రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి సినిమా అంటే ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయన మాస్టర్. స్టార్ల క్రేజ్ ప్లస్ రాజమౌళి మార్కెటింగ్ స్టాటజీ ఇవన్నీ RRR ప్లస్ అవ్వబోతున్నాయి. కానీ రిలీజ్ కి రెండు నెలలే ఉంది రాజమౌళి ఇప్పటి వరకు రిలీజ్ ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు అనుకుంటున్న వారికి వచ్చే శుక్రవారం సమాధానం రానుంది.

ADVERTISEMENT

దీపావళి సందర్భంగా ఓ టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు జక్కన్న. అదిరిపోయే విజువల్స్ తో టీజర్ కట్ చేస్తున్నారట. అయితే ఈసారి అన్ని భాషల్లో ఒక్కో టీజర్ కాకుండా సింగిల్ టీజర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అక్కడి నుండి రిలీజ్ వరకూ ప్రమోషన్ ప్లాన్ రెడీగా ఉందట. త్వరలోనే టీం అంతా ముంబై వెళ్లనున్నారని తెలుస్తుంది. నార్త్ లో కూడా సినిమాకు క్రేజ్ తీసుకొచ్చే ప్రమోషన్స్ చేసేందుకు కొన్ని ప్రమోషన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది.

బాహుబలి ఫ్రాంచైజీ కి కూడా ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. అక్కడ టివీ షోలకు అలాగే ప్రెస్ మీట్లకు టీం ఎటెండ్ అయి అక్కడి మీడియా సపోర్ట్ తీసుకొని మంచి మార్కెటింగ్ చేసుకున్నారు. వచ్చే నెల నుండి మొదలు పెట్టి రెండు నెలల పాటు భారీ ప్రమోషన్స్ తో ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. బాహుబలి 2 తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరి ఈ మల్టీ స్టారర్ తో రాజమౌళి బాహుబలి రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటాడా.. ? కనీసం ఆ ఫిగర్స్ దగ్గరి వరకూ అయిన వెళ్తారా ? అనేది ఆసక్తి నెలకొల్పుతుంది.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Ramayana Inside Reports: Great Visuals, Weak Emotions?

An alleged inside report on Bollywood's magnum opus Ramayana Part 1 claims that the film…

2 minutes ago

DSP’s Yellamma Set for Pre-Summer Release

Following the success of Balagam, National Award-winning filmmaker Venu Yeldandi is working on his next…

21 minutes ago