
అలాగే నెగటివ్ ఆంగ్లేయుల పాత్రలలో ఇద్దరిని పరిచయం చేశారు. రేయ్ స్టీవెన్సన్ స్కాట్ అనే పాత్రలో, అదే విధంగా అలిసన్ డూడీ లేడీ స్కాట్ పాత్రలో నటించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే ఇది వరకు చెప్పిన జులై 30, 2020 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు పది భాషలలో వస్తుందని చెప్పుకొచ్చారు.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు మాములే. మిగతా ఐదు భాషలు ఏమై ఉంటాయి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా వార్తల ప్రకారం కొన్ని అంతర్జాతీయ భాషలలో సినిమాను విడుదల చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో భాగంగా కొన్ని అంతర్జాతీయ సినిమా పంపిణీ కంపెనీలతో స్టూడియోలతో చర్చలు జరుపుతున్నారట.
విడుదలకు ముందే భారీ స్థాయిలో సినిమాను మార్కెట్ చెయ్యాలని రాజమౌళి వ్యూహంగా కనిపిస్తుంది. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రాజమౌళి. బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వాటికి ఏమాత్రం తగ్గదని చిత్రబృందం అంటుంది.
YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…
అవును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో మాట్లాడుతూ,…