
దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, గ్లామర్ తో పాటు అభినయం ప్రదర్శించే పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ అంకిత భావం చాలా ఆశ్చర్యం కలిగించిందని, తెలుగు నాట జెండా పాతేయడం ఖాయమని హీరో రవితేజ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఇక నటకిరీటీ రాజేంద్రప్రసాద్ అయితే, ఇండస్ట్రీలో 40 ఏళ్ళుగా తానూ ఉన్నానని, అనేక సినిమాలు చూసాను గానీ, ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు, ఇప్పటివరకు ఏ భాషలోనూ రాలేదని “రాజా ది గ్రేట్”ను ఆకాశానికెత్తేశారు.
సినిమాను దర్శకుడు ఎలా తెరకెక్కించారో అన్న విషయం తెలియాలంటే 19వ తేదీ వరకు వేచిచూడాలి గానీ, విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ అయితే రాజేంద్రప్రసాద్ చెప్పినంత ఫీలింగ్ ను కలిగించలేదన్నది స్పష్టం. మరి అనిల్ అంత అద్భుతంగా ఎలా తీసారో గానీ, నిర్మాత దిల్ రాజు కూడా అమావాస్య సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరీ, ఈ సినిమా విజయవంతం అవుతుందని చెప్పారు. సో… మాస్ మహారాజా ఫ్యాన్స్ కు ‘ఫెస్టివల్’ టైం స్టార్ అయినట్లేనా..! అలాగే ఈ సినిమాతో అనిల్ రావిపూడి పేరు మరోసారి మోతమోగడం ఖాయమేనా!
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…