ట్రైలర్ టాక్ – సమంత షాట్ ఏదైతే ఉందో..!

ఓ ముగ్గురు స్నేహితులు… వెకేషన్… బంగ్లా… దెయ్యం… దానిని చేధించడానికి వచ్చే హీరో… ఇలా ఇప్పటికి ఎన్ని సినిమాలు చూసి ఉంటాం. అయితే ఎన్ని చూసినా ఆసక్తికరంగా చెప్తే… మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం… అదే హార్రర్ మూవీలో ఉన్న స్పెషాలిటీ… దీనినే మరోసారి నిరూపించేందుకు “రాజు గారి గది 2” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలి పార్ట్ అనూహ్య విజయం సాధించడంతో, దర్శకుడు ఓంకార్ కు రెండవ పార్ట్ లో ఏకంగా నాగార్జున, సమంత వంటి భారీ తారాగణం సొంతమైంది.

అక్టోబర్ 13వ తేదీన విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ను ఏఎన్నార్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. కధ పరంగా ఇప్పటికే ఇంట్రడక్షన్ లో విశదీకరించగా, ఆ కధకు స్టార్ బలం తోడయ్యింది. అలా సాగిపోతున్న ఈ ట్రైలర్ లో సమంతకు సంబంధించిన రెండు షాట్స్ ఉండగా, ఆ రెండు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ మొదట్లో ఆత్మ గాలిలో కలిసిపోయే షాట్ ఒకటి కాగా, రెండవది మాత్రం ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది.

ADVERTISEMENT

నాగార్జున పెయింటింగ్ వేసిన సమంత బొమ్మ కూడా మాయం కావడం అనేది కొత్తగా ఉండడంతో పాటు, ఈ షాట్ కు థమన్ అందించిన మ్యూజిక్, సీన్ ను బాగా ఎలివేట్ చేసింది. నాగ్ పెయింటింగ్ షాట్ మరియు సమంత మాయమయ్యే షాట్స్ ఏవైతే ఉన్నాయో… సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయని చెప్పవచ్చు. అప్పటివరకు రొటీన్ గా ఉన్న హార్రర్ కామెడీ కాస్త ఆసక్తికరమైన మలుపును తీసుకుంది. దీంతో అక్కినేని అభిమానులు అక్టోబర్ 13 కోసం ఆసక్తిగా నిరీక్షిస్తుంటారని చెప్పడంలో సందేహం లేదు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

యష్‌తో ఆదిత్య ధర్ కలిస్తే… వర్మ పరిస్థితేంటి?

ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…

1 minute ago

Pics: Anaira Stuns In Sizzling Boho Chic Fashion

Anaira Gupta is raising temperatures with her sensational new style statement, effortlessly blending relaxed bohemian…

18 minutes ago