
ఈ సినిమా హిందీ రైట్స్ 12.5 కోట్లకు కొన్నారట, సెటిలైట్ రైట్స్ ఏకంగా ఆరు కోట్లకు కొన్నారట. అంటే నాన్ – థియేటర్ రైట్ తోనే 18.5 కోట్లు సంపాదించేశారన్నమాట. ఇక సినిమా ఆడినా ఆడకపోయినా ఇబ్బంది లేదు. ఒక్క హిట్ కూడా లేని బెల్లంకొండ కు ఇంత పెడుతున్నారంటే నమ్మే పరిస్థితి ఉందా? హైప్ చేసుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే కొంచెం నమ్మేలా ఉండాలి కదా? ఇటువంటి లీకుల వల్ల ఎవరికి ఉపయోగం? తొందరలో రాక్షసుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.
రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను నిజానికి మొదట నితిన్ చేయాలి కానీ చేయలేదు. ఇప్పుడు అతని ప్లేస్ లో కి బెల్లంకొండ వచ్చాడు. తమిళ చిత్రం ‘రాచ్చసన్’ కి రీమేక్ ఈ రాక్షసుడు. మొన్న ఆ మధ్య ఈ సినిమాలో తమిళంలో ఉన్న సీన్లు చాలా వరకూ కట్ పేస్ట్ చేశారని, తెలుగులో షూటింగ్ చేసింది చాలా తక్కువని వార్తలొచ్చాయి. అయితే చిత్ర యూనిట్ ఈ వార్తలను ఖండించింది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.
The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…