
తమిళ సినిమా ‘రాక్షసన్’కు తెలుగు రీమేక్ ఇది. శనివారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ సైకో స్కూల్ కు వెళ్లే అమ్మాయిలను వరుస హత్యలు చేస్తూ ప్రజల్ని భయపెడుతూ కనిపించాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘సింపుల్‌గా చెప్పాలంటే.. వాడో సైకో.. వాడికి నొప్పి అంటే ఏంటో తెలియదనుకుంటా. రాక్షసుడు..’ అని ఓ వైద్యుడు బెల్లంకొండకు విలన్ స్వభావం గురించి చెప్పడం సినిమాకు ఎస్సెన్స్ అని చెప్పుకోవాలి.
ఈ రీమేక్ చిత్రంలో తమిళ సినిమాను నేపధ్య సంగీతం, డైలాగులు, విజువల్స్ తో పాటు మక్కీకి మక్కీ దించేశారు. తమిళ మాతృక సినిమాను చూసినవారికి పెద్దగా ఎక్కక పోవచ్చు గానీ మిగతా వారికి ఈ సినిమా బానే ఉండొచ్చు. జులై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంతోనైన బెల్లంకొండ హిట్ కొడతాడేమో చూడాలి. జులైలో సమంత ఓ బేబీ, రామ్ ఇస్మార్ట్ శంకర్, విజయ్ దేవేరకొండ డియర్ కామ్రేడ్ వంటి సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…