
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలో రకుల్ కూడా షూటింగ్ మొదలుపెడుతుంది. ఇది ఇలా ఉండగా… మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో నాగ చైతన్య తదుపరి చిత్రం కోసం రకుల్ ని ఫైనల్ చేశారని అంటున్నారు . రకుల్ గతంలో నాగ చైతన్యను రారండోయ్ వేడుక చూద్దాం లో హీరోయిన్ గా మెరిసింది.
విక్రమ్ నాగచైతన్య గతంలో మనం క్లాసిక్ సినిమాను ఇవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటం ఖాయం. ఈ సినిమాకు థాంక్ యూ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ ఇచ్చాడట. ఈ నటి నాగ చైతన్య తండ్రి నాగార్జున సరసన ఇటీవల మన్మథుడు 2 లో కూడా కనిపించింది.
మొత్తానికి రకుల్ మరో సారి బిజీ హీరోయిన్ గా మారుతుంది. పారితోషికం విషయంలో కూడా ఆమె కొంత పట్టువిడుపులు ప్రదర్శించడంతో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారట. ఈ సినిమాలతో కొన్ని హిట్లు సంపాదిస్తే ఆమె కెరీర్ మరోసారి గాడిలో పడినట్టే అని చెప్పుకోవాలి.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…