ఫ్లాష్ ఫ్లాష్… ‘కత్తి’ రీమేక్ కే ‘మెగా’ ఓటు! చెర్రీ ప్రకటన!

మెగా అభిమానులందరికీ శుభవార్త. కళ్ళు కాయలు కాచేలా దాదాపు ఎనిమిదేళ్ళుగా ఎదురు చూసిన ‘మెగా’ ప్రకటన 2015 ఇయర్ ఎండింగ్ లో ‘మెగా’ తనయుడు రామ్ చరణ్ నుండి వచ్చింది. ఎలాంటి ప్రయోగాలకు తావివ్వకుండా మురుగదాస్ – విజయ్ కాంభినేషన్ లో విజయవంతం అయిన “కత్తి” సినిమా రీమేక్ చేయబోతున్నామని రామ్ చరణ్ ప్రకటించారు. అలాగే ముందుగా హల్చల్ చేసిన సమాచారం ప్రకారమే వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారని ఖరారు చేసారు.

బెంగళూరులో జరిగిన 2015 రిట్జ్ ఐకాన్ అవార్డు కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ తొలిసారిగా ఈ ప్రకటన చేసారు. అయితే హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ నిర్వహించి ‘మెగా’ క్యాంప్ మరోసారి ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇన్నాళ్ళు వేచి చూసిన ప్రకటన అయితే వచ్చింది గానీ, ఈ “కత్తి” రీమేక్ కూడా మరో “ఆటో జానీ” మాదిరి కాకూడదు అన్న భయం కూడా మెగా అభిమానుల్లో వ్యక్తమవుతోంది. రీమేక్ చిత్రమే కావడంతో బహుశా 2016లోనే ‘మెగాస్టార్’ 150వ సినిమా విడుదలకు నోచుకోవచ్చు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అయితే ఒక రీమేక్ చిత్రానికి చిరంజీవి ఓటు వేయడం పట్ల విమర్శలు కూడా వినపడుతున్నాయి. అయితే ఏదోక సినిమా ప్రకటించారు… అదే చాలు అన్న ఆనందమే మెగా ఫ్యాన్స్ లో కలుగుతోంది. మొత్తానికి 2015 డిసెంబర్ నెల మెగాభిమానుల సహనానికి తీపి కబురును అందించింది.

Share
Published by

Recent Posts

గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?

రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…

29 seconds ago

RC17 Finally Moves Forward: Sukumar Locks Final Draft

Ram Charan and Sukumar’s RC17 has finally taken a major step forward. The latest update…

11 minutes ago