
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సినిమాని ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఏకంగా వచ్చే ఏడాది వేసవి వరకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే… ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. రామ్ చరణ్ దాదాపుగా సినిమాలో నలభై నిముషాల పాటు కనిపిస్తారని సమాచారం. అయితే ఆగస్టులో విడుదల చెయ్యాలని అనుకున్నాకా రాజమౌళి దానికి అడ్డుచెప్పడట. ఆర్ఆర్ఆర్ విడుదల తరువాతే చరణ్, ఎన్టీఆర్ ల మిగతా సినిమాలు విడుదల కావాలని ఆయన పట్టుబడుతున్నారు.
రాజమౌళి చెప్పాకా కాదనే అవకాశం తక్కువ. దీనితో చిరంజీవి తన సినిమాని వాయిదా వేసుకోవడానికి సిద్ధం అయ్యారట. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తొందరలో ఆమె సినిమాలోకి ఎంటర్ అవుతుంది. మణి శర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనున్నారు.
గతంలో చిరంజీవి సెన్సషనల్ ఆల్బమ్స్ ఇచ్చిన మణి శర్మ చాలా సంవత్సరాలు ఫామ్ సమస్యలతో సతమతం అయ్యారు. ఇటీవలే ఆయన రామ్ పూరి జగన్నాధ్ ల ఇస్మార్ట్ శంకర్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. దీనితో ఆయన మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. చిరంజీవి సినిమా అంటే పెద్ద అవకాశం దీనితో ఒక బ్లాక్ బస్టర్ ఆల్బం ఇవ్వడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారట.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…