
సినిమాలోని టైటిల్ సాంగ్, చివరిలో ఆమె చేసిన ఫైర్ డాన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో సైరాతో ఆమెకు మంచి పేరు వచ్చినట్టు అయ్యింది. దీనితో ఆమెకు ఆఫర్లు కూడా బాగా వస్తున్నాయట. ఇది ఇలా ఉండగా సైరా ప్రమోషన్స్ కు నయనతార మొండి చెయ్యి చూపిస్తే తమన్నా మాత్రం పూర్తిగా సహకరించింది. దీనితో రామ్ చరణ్ ఫిదా అయిపోయాడట.
సినిమాలో నటించినందుకు తమన్నాకు ఎంత ముట్టిందో తెలీదుగానీ, రామ్ చరణ్, ఉపాసన ఆమెకు ఒక ఖరీదైన కానుకను మాత్రం ప్రజెంట్ చేశారట. ఆ విషయాన్ని తమన్నా స్వయంగా ప్రకటించింది. ఫొటోను పోస్టు చేసింది. ఇచ్చినందుకు చరణ్, ఉపాసనలకు కృతజ్ఞతలు చెప్పింది. అది చూడటానికి పెద్ద డైమండ్ రింగ్ లా అనిపిస్తుంది.
ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుందనేది.. ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల అంచనా ప్రకారం.. దాని విలువ దాదాపు రెండు కోట్ల రూపాయలు. ఒకవేళ నిజమైతే మాత్రం తమన్నాకు బాగా కిట్టుబాటు అయినట్టే. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ సినిమాలో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. దానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.
Nani’s speech at The Paradise pre-release event was less about the usual pre-release hype and…
Allu Arjun-Atlee’s Raaka has created huge curiosity with its ambitious scale, and the recently released…