
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అవలభించిన సూత్రాన్నే ప్రస్తుతం ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా పాటిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ‘మిర్చి’ చిత్రం తర్వాత కొరటాల శివతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి మరీ వదిలేసిన రామ్ చరణ్, “శ్రీమంతుడు” సినిమా సూపర్ సక్సెస్ తర్వాత కొరటాలతో ఎలాగైనా ఒక చిత్రాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నారట.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో “జనతా గ్యారేజ్” సినిమాతో బిజీగా కొరటాల తదుపరి చిత్రం చెర్రీతోనే ఉంటుందని సినీ వర్గాలు ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాయి. కొరటాల కాకుండా, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో మళ్ళీ లైంలైట్ లోకి వచ్చిన సుకుమార్ తో కూడా మరో సినిమాకు చెర్రీ కమిట్ అయ్యాడని భోగట్టా. నిర్మాతలను దృష్టిలో పెట్టుకుంటే హిట్ దర్శకులను ఎంపిక చేసుకోవడం సబబైన నిర్ణయమే గానీ, కధల ఎంపికలో కూడా కొత్తదనానికి చెర్రీ అవకాశం ఇస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
Mahakali starring Bhumi Shetty, Akshaye Khanna, Sriya Reddy and Khushbu Sundar in leading roles has…
Nitesh Tiwari’s Ramayana is finally out now in theatres. It was undoubtedly a very long…