‘జిల్‌’మనిపించనున్న చరణ్‌!

మెగా హీరో రామ్‌ చరణ్‌ త్వరలో తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ‘తని వరువన్‌’ రీమేక్‌లో నటించబోతున్న విషయం తెల్సిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఆ రీమేక్‌ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. చరణ్‌ ఎప్పుడైనా కూడా ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉంటాడు. తాజాగా మరో సారి అదే పద్దతిని ఫాలో అయ్యాడు. రీమేక్‌ ఇంకా ప్రారంభం కాకుండానే మరో దర్శకుడికి చరణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

‘జిల్‌’ చిత్రంతో స్టైలిష్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో చరణ్‌ నటించేందుకు ఓకే చెప్పాడు. ‘జిల్‌’ చిత్రంలో గోపీచంద్‌ను ఈ దర్శకుడు చూపించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాను ఈయన తెరకెక్కించిన తీరు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈయన దర్శకత్వంలో చరణ్‌ ఒక స్టైలిష్‌ మూవీలో నటించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాధాకృష్ణ చెప్పిన కథ చరణ్‌కు నచ్చిందని, వచ్చే వేసవిలో వీరి కాంబినేషన్‌లో మూవీ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయని మెగా వర్గాల వారు అంటున్నారు.

Share
Published by

Recent Posts

Viral Interview Clip Exposes Big Stars’ Hidden Secrets?

Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…

48 minutes ago

Sai Reddy Bigger Threat Than Sharmila For Jagan?

Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…

1 hour ago