
తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తని వరువన్’ రీమేక్‌లో చరణ్‌కు జోడీగా శృతిహాసన్‌ను ఎంపిక చేయాలని నిర్మాత అల్లు అరవింద్ మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి భావించారు. అందుకోసం శృతిహాసన్‌ను వీరిద్దరు సంప్రదించారు. అప్పుడే వారిద్దరికి షాక్ ఇచ్చేలా తాను ఆ సినిమాలో నటించలేను అంటూ చెప్పిందట. దాంతో చరణ్ కూడా అవాక్కయ్యాడని చెబుతున్నారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న తాను చరణ్ సినిమాకు డేట్లు ఇవ్వలేను అంటూ శృతి తేల్చి చెప్పిందట. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో నయనతార చేసిన పాత్రను చేయడం ఇష్టం లేక పోవడం వల్లే శృతిహాసన్ ఆ రీమేక్‌కు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈమెను ఎన్టీఆర్, కొరటాల శివల ‘జనతా గ్యారేజీ’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. నాగచైతన్య హీరోగా నటించబోతున్న ‘ప్రేమమ్’ రీమేక్‌లో కూడా శృతిహాసన్ నటిస్తోంది.
Actor Soori is currently doing round the clock promotions for his upcoming film Mandaadi, which…
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…