‘లైవ్’లో శివాజీ – వర్మల మధ్య ఘాటు వ్యాఖ్యలు!

“వంగవీటి” సినిమాపై తన అభిప్రాయాలు తెలిపేందుకు టీవీ 9 ఛానల్ లో లైవ్ షోలో పాల్గొన్నారు దర్శకులు వర్మ. ఈ సందర్భంగా వర్ధమాన నటుడు శివాజీ ఫోన్ చేసి… “ఒక సామాజిక బాధ్యత గల పౌరుడిగా ఇలాంటి కుల వివక్షను ప్రదర్శించే సినిమాలు తీయవద్దని, మీ క్రియేటివిటికి ఇంతకు మించిన కధలు చాలా దొరుకుతాయని, ఇది కేవలం తన సూచన మాత్రమేనని” అన్నారు.

దీనిపై కాస్త కటువుగానే స్పందించిన వర్మ, “ఏదో 5వ తరగతి పిల్ల వాడికి క్లాస్ పీకినట్లు తనకు చెప్పవద్దని, ఇవన్నీ తనకు తెలిసినవేనని” అన్నారు. మళ్ళీ లైన్ లోకొచ్చిన శివాజీ, “మీకు క్లాస్ పీకే స్థాయి తనది కాదని, అయినా అయిదవ తరగతి పిల్లాడ్ని కొట్టి చెప్తామని, ఇలా చెప్పమని, మీరు యూట్యూబ్ లో సినిమాలు రిలీజ్ చేస్తే చూడాలి, మీరు ఏది చెప్తే అది మేం వినాలి, కానీ మేం ఏది చెప్పినా మీరు వినరా? అయినా ఇప్పటికీ ఆత్యాచారం జరిగిన అమ్మాయి మీద మళ్ళీ బలాత్కారం చేస్తే ఎలా ఉంటుందో… ప్రస్తుతం వర్మ చేసే సినిమా కూడా అలాంటిదేనని, ఇప్పటికే కుల రాజకీయాలతో ఏపీ అట్టుడుకుతుంటే వర్మ ఇలాంటి సినిమాలు తీయడం సబబు కాదు అంటూ” తన అభిప్రాయాన్ని ఘాటు వ్యాఖ్యలతో ముగించారు శివాజీ.

ADVERTISEMENT

ఇక, ఈ సినిమా విడుదల తేదీపై యాంకర్ అడిగిన ప్రశ్నకు… “ఎప్పుడు పూర్తయితే అప్పుడు విడుదల అవుతుంది, ఎప్పుడు పూర్తవ్వాలో అప్పుడే పూర్తవుతుంది” అంటూ వర్మ మార్క్ సమాధానాలు ఇచ్చారు. మీకు నచ్చినా లేకున్నా నేను తీయకుండా ఉండను, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు… అంటూ వర్మ నుండి సహజసిద్ధంగా వచ్చే జవాబులే.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

5 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

8 hours ago