“బెజవాడ” టు “బెజవాడ” – ఎ ‘స్మాల్’ రివ్యూ!

రాంగోపాల్ వర్మ ఈ పేరు సంచలనాలకు ఓ బ్రాండ్ గా మారిపోయింది. వర్మ సినిమాలన్నీ సంచలనాల కోసం తీస్తారో లేక తీసాక సంచలనం అవుతాయో… బహుశా ఆ దేవుడికే తెలియాలి. 25 సంవత్సరాల క్రితం “శివ” సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానానికి “వంగవీటి” రూపంలో త్వరలో ముగింపు పడనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వర్మ కెరీర్ లో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, శుభంకార్డులకు సంబంధించిన విశేషాలను పరిశీలిస్తీ…

ADVERTISEMENT

“శివ” సినిమాతో అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చిన వర్మ, ఈ సినిమా స్పూర్తి విజయవాడలో స్వయంగా చూసిన కొన్ని సంఘటనలేనని వర్మ పలు సందర్భాలలో చెప్పారు. అలా ప్రారంభమైన కెరీర్ కు “గోవింద గోవింద” సినిమా ఇంటర్వెల్ కార్డు వేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు పెట్టిన ఇబ్బందులకు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు వర్మ. ఆ తర్వాత ఫ్యాక్షన్ కధాంశం అయిన “రక్తచరిత్ర”తో రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టి, దానికి ప్రతిఫలంగా వర్మ తన సినిమాలతో ప్రేక్షకుల మీద ఎదురుదాడి చేస్తూనే ఉన్న వైనం తెలిసిందే.

ఇక తన సినీ ప్రస్థానానికి ముగింపు చెప్పే సమయం వచ్చిందని అర్థమైన వర్మ “వంగవీటి” పేరుతో తీస్తున్న సినిమాతో శుభంకార్డు వేయబోతున్నారు. 30 సంవత్సరాల క్రితం విజయవాడ ప్రజలకు సుపరిచితమయిన “వంగవీటి” జీవిత చరిత్రను ఈ తరం ప్రజలకు తెలియ చెప్పడానికి వర్మ చేస్తున్న ప్రయత్నమిది. తనను ఇంప్రెస్ చేసిన వ్యక్తులలో రంగా ఒకరు కావడంతో, ఆయన చరిత్రతో తన సిని జీవితానికి ముగింపు పలకాలని వర్మ భావించారు.

అంటే… శివ “బెజవాడ”తో మొదలైన సినీ ప్రస్థానం వంగవీటి “బెజవాడ”తోనే ముగుస్తుండడం విశేషం. అయితే తాజా సినిమాలో రాజకీయం కూడా ఒక భాగం కావడంతో, సదరు రాజకీయ నాయకుల గుట్టు విప్పుతారో లేదోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సినిమా విడుదల కోసం విజయవాడలో రంగా అనుకూల వర్గం, ప్రతికూల వర్గం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఏపీలో ఏర్పడిన ‘కుల’ రాజకీయాల ప్రభావం “వంగవీటి” సినిమాపై పడే అవకాశం స్పష్టంగా ఉందని, ఈ సినిమా విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కాపులకు న్యాయం జరగాలంటూ పోరాటాలు జరుగుతున్న వేళ, వంగవీటి రాధా, రంగాల జీవిత చరిత్ర ప్రస్తావిస్తే ఆరిపోయిన అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. మరి వర్మ చివరి సినిమా ధియేటర్ల వరకు వస్తుందో లేదో చూడాలి.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

5 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

8 hours ago